నల్లబెలూన్లతో పార్టీ ఎమ్మెల్యేల నిరసన

24 Mar, 2013 19:18 IST
మంగళగిరి (గుంటూరు జిల్లా), 24 మార్చి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించడంపై పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వారు నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన వెల్లడించారు. శ్రీ జగన్ కేసులో ‌సిబిఐ వ్యవహరిస్తున్న తాత్సార ధోరణిపై వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.