నేడు నాదర్‌గుల్ నుంచి ‘మరో ప్రజాప్రస్థానం’
14 Dec, 2012 11:14 IST
రంగారెడ్డి జిల్లా:
‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారంనాడు నాదర్‌గుల్ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. బీఎన్‌రెడ్డి నగర్ వరకు శ్రీమతి షర్మిల నడుస్తారు. ఉదయం నాదర్‌గుల్‌లో ప్రారంభమయ్యే యాత్ర జనప్రియ కాలనీ, గాంధీనగర్, బడంగ్‌పేట మీదుగా బీఎన్‌రెడ్డి నగర్‌కు చేరుకుంటుంది. అక్కడ జరిగే సభ అనంతరం ఇంజాపూర్ సమీపంలో శ్రీమతి షర్మిల బస చేస్తారు.