మై డీయర్ మార్తాండమ్ మూవీ టీజర్ విడుదల
16 Jul, 2018 11:18 IST
తూర్పు గోదావరి: మై డీయర్ మార్తాండమ్ మూవీ టీజర్‌ను వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం విడుదల చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ తమ మూవీ టీజర్ విడుదల చేయడం పట్ల సినిమా డైరెక్టర్ హరీష్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఒక చిన్న సినిమా బతకాలని వైయస్ జగన్ ప్రోత్సహించడం మరిచిపోలేని అనుభూతి అన్నారు. పృధ్వీ సహకారంతో సినిమా సక్సెస్ అయ్యిందని, ఇప్పుడు వైయస్ జగన్ తమ టీజర్ విడుదల చేయడంతో ఇక సూపర్ డూపర్ హిట్టే అని హర్షం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ విడుదల చేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.