నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి
13 Apr, 2017 17:12 IST
సర్వేపల్లిః వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పొదలకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మండల పరిధిలోని ఇనుకుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అదే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ... పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.