వైయస్ జగన్‌కు ముస్లిం పెద్దల కృతజ్ఞతలు
26 Nov, 2017 13:02 IST
పత్తికొండలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ ముస్లిం మత పెద్దలు కలుసుకున్నారు. ఇమామ్‌ల గౌరవ వేతనాన్ని పెంచుతానంటూ చేసిన ప్రకటనపై హర్షం వ్యకం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణగిరి మండలంలో శనివారం ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్ జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి వస్తే మసీదు, చర్చి, దేవాలయాల నిర్వహణ ఖర్చుల కోసం రూ.15 వేలు, మసీద్ ఇమమ్‌లకు నెలకు రూ.10వేల వేతనం ఇస్తాం.’ అని హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.