ముస్లిం విద్యార్థులకు దుస్తుల పంపిణీ
6 Nov, 2018 13:33 IST
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏడాది పూర్తి అయిన సందర్భంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు విశాఖ పార్లమెంటు మైనార్టీ విభాగం అధ్యక్షులు బర్కత్ అలీ ఆధ్వర్యంలో గ్రేటర్ విశాఖపట్నం నగరంలోని 1వ వార్డ్ ఏరియాలో విశాఖ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అరబ్బీ పాఠశాల (మాదర్శ) లో ఉన్న ముస్లిం పిల్లల కు దుస్తులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమని కి ముఖ్యఅథితి గా విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు టి. విజయకుమార్, పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఫారూఖ్ పాల్గొని ముస్లింలతో కలిసి వైయస్ జగన్ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు,