షర్మిలకు ముస్లీం సోదరుల సంఘీభావం
25 Nov, 2012 12:37 IST

మహబూబ్ నగర్ జిల్లాలోని వెంకటాపురం స్టేజీ వద్ద నుంచి ఆదివారం షర్మిల యాత్ర ప్రారంభమైంది. 39వ రోజు కొనసాగుతున్న షర్మిల యాత్రకు ముస్లీం సోదరులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దారి పొడవునా జై జగన్.. జై జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిల పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది.