తొట్టంబేడులో ఎంపీ వరప్రసాద్‌ పర్యటన

19 May, 2017 14:38 IST

చిత్తూరు: పేద ప్రజల భూములను చంద్రబాబు సర్కార్‌ బలవంతంగా లాక్కొంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ ధ్వజమెత్తారు. తొట్టంబేడు మండలంలో భూములు కోల్పోతున్న గ్రామాల్లో ఎంపీ పర్యటించారు.  చీయవరం, తొట్టంబేడు, కాసారం ప్రాంతాల్లో రైతుల భూములు లాక్కోవడం దారుణమన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటూ విదేశీ కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతున్నారని విమర్శించారు.