ఎమ్మెల్యే కృష్ణదాసు సతీమణిపై పోలీసులు దౌర్జన్యం
కాగా, పోలీసుల తీరుపై ధర్మాన కృష్ణదాసు తీవ్రంగా ప్రతిస్పందించారు. పోలీసుల అత్యుత్సాహంపై అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసుల వ్యవహారశైలిని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరబ్‌గౌర్‌కు కృష్ణదాసు ఫిర్యాదు చేశారు. దురుసుగా వ్యవహరించిన గార ఎస̴్ఐ నారీమణిపై చర్యలు తీసుకోవాలని కలెక్యర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు.
బంద్ సందర్భంగా పోలీసులు - వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా సుమారు 400 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలంటూ వందలాది మంది పార్టీ శ్రేణులు పోలీసు స్టేషన్ల వద్ద ఆందోళకు దిగారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కృష్ణదాసు సతీమణి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.