టీడీపీ ప్రలోభాలు బయటపడకుండా నోటీసులు

7 Mar, 2018 14:56 IST
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ రాజకీయ కక్షతోనే పోలీసు చేత తనకు నోటీసులు ఇప్పించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. క్రికెట్‌ బెట్టింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు బయటపడకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు నోటీసులిచ్చారన్నారు. మంత్రి నారాయణకు ఎస్పీ రామకృష్ణ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రేపు విచారణకు హాజరై నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు.