ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి నివాళి
7 Jun, 2018 12:07 IST
కర్పూలు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అవదూత రామిరెడ్డి తాత మనవడు దాసరి ఉపేంద్రనాథ్‌రెడ్డికి వైయస్ఆర్‌సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరు వెంకట్‌రెడ్డిలు నివాళులర్పించారు. బుధవారం ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపేంద్రనాథ్‌రెడ్డి దుర్మరణం పొందారు. విషయం తెలియగానే మృతుడి ఇంటికి చేరుకున్న గౌరు దంపతులు ఆయన భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.