మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు

1 Dec, 2015 15:32 IST
ఎయిర్ ఇండియా అధికారిని కొట్టాడంటూ అవాస్తవాలు
రాజకీయ ప్రత్యర్థుల ప్రోద్బలంతో పోలీసుల తప్పుడు కేసులు
లో
క్
సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన మిథున్ రెడ్డి

ప్రతిపక్షంపై  ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలకు పాల్పడుతోంది. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అక్రమంగా కేసులు బనాయిస్తోంది.  తిరుపతి విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఓ అధికారిపై చేయి చేసుకున్నాడంటూ పోలీసులు తప్పుడు కేసులు బుక్ చేశారు. రాజకీయ దురుద్దేశ్యంతో కొందరు కావాలనే చేస్తున్నారని, తాను ఏ అధికారిపై చేయిచేసుకోలేదని అదంతా  అవాస్తమని మిథున్ రెడ్డి కొట్టిపారేశారు.  కావాలంటే సీసీ పుటేజ్ పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మిథున్ రెడ్డి తెలిపారు.

నవంబర్ 26న హైదరాబాద్ నుంచి తిరుపతికి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చినట్లు మిథున్ రెడ్డి చెప్పారు. అక్కడి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్  దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, విమానం ఎక్కనీయడం లేదని కొందరు ప్రయాణికులు తనకు ఫిర్యాదు చేసినట్లు మిథున్ రెడ్డి తెలిపారు. ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆలస్యానికి కారణాలను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా అతడు తనపై కూడా అమర్యాదగా ప్రవర్తించాడని మిథున్ రెడ్డి అన్నారు. ఈసంఘటనకు బాధిత ప్రయాణికులతో పాటు అక్కడ పలువురు సాక్ష్యులున్నట్లు మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఆతర్వాత ఆ అధికారి తన సీనియర్ అధికారులు, పోలీసుల సమక్షంలో తనకు క్షమాపణలు చెప్పారని మిథున్ రెడ్డి చెప్పారు.

అకారణంగా తాను మేనేజర్ పై దాడి చేసినట్లు రాజకీయ ప్రత్యర్థుల ప్రోద్బలంతో పోలీసులు కేసు పెట్టారని మిథున్ రెడ్డి వాపోయారు. సీసీపుటేజ్ ద్వారా తన వాదనను రుజువు చేయాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఐతే, ఇప్పటివరకు ఆరికార్డ్ ను విడుదల చేయకపోవడంపై రాజకీయ ప్రత్యర్థుల దుశ్చర్యగా భావిస్తున్నామన్నారు మిథున్ రెడ్డి. ఈవిషయంపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఫిర్యాదు చేసినట్లు మిథున్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హైకోర్ట్ ను ఆశ్రయించి, తమ ఫిర్యాదును రిజిస్టర్ చేయాల్సిందిగా ఏపీ పోలీసులను ఆదేశించాలని కోరనున్నట్లు మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.