మిన్నంటిన జగన్నినాదాలు

25 Sep, 2012 02:56 IST
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరయ్యేందుకు చంచల్‌గుడా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. జననేతను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆయన బయటకు రాగానే జై జగన్ అనే నినాదాలతో వారు ఆ పరిసరాలను హోరెత్తించారు. జగన్ మందస్మిత వదనంతో రెండు చేతులు కలిపి నమస్కరిస్తూ, వాహనంలోకి ఎక్కారు. ఆయన దగ్గరకు చేరడానికి ప్రయత్నించి అభిమానులు విఫలమయ్యారు. ఆయనను దగ్గరనుంచి చూడాలన్న ఆశ నెరవేరక నిరాశచెందారు. ఉదయం ఎనిమిది గంటలకే అభిమానులు అక్కడికి చేరారు. జైలుకు వచ్చే రెండు మార్గాలను పోలీసులు మూసివేశారు. బ్యారికేడ్లు ఏర్పాటుచేశారు. 200 మీటర్ల దూరంలోనే అందరినీ నిలిపేశారు. జగన్ బయటకు రాగానే అభిమానులు దూసుకొచ్చారు. 

జగనన్నను దగ్గర్నుంచి చూద్దామని వస్తే కుదరలేదని ఓ మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. దూరంనుంచి చూసేందుకు కూడా అనుమతించకపోవడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆయనపై అభిమానంతో ఇక్కడికి వచ్చామని ఆమె చెప్పారు. ఆయనను దూరంనుంచి చూడడం సంతోషంగా ఉంది.  బయట చూసి ఎన్నాళ్ళో అయ్యందని చెప్పారు.  జగన్ సింహంలా ఉంటారని తెలిపారు.  ఇదే జైలులో ఎన్నోసార్లు ఆరోగ్య శిబిరాలు నిర్వహిచేందుకు వచ్చామనీ, ఇప్పడిలా రావడం చాలా బాధగా ఉందనీ ఆమె గద్గద స్వరంతో తెలిపారు.  ఎన్నో రోజుల తర్వాత బయటకు వస్తున్న ఆయనను దగ్గరనుంచి  చూసే అదృష్టం లేకుండా పోలీసులు చేశారని మండిపడ్డారు.  త్వరలో ఆయన విడుదలవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నాయకుడంటే జనం మధ్య జనం కోసం పనిచేసే మనినీ, నాయకుడంటే జనం కోసం నడిచే వాడు, జనాన్ని నడిపించేవాడూ అనీ  ఆమె పేర్కొన్నారు.  నిజం నిలకడమీద తెలస్తుందన్నారు.  ఇంతకు ముందు అక్రమంగా సంపాదించిన వారిని జైల్లో పెట్టి అప్పుడు జగన్ బాబు జోలికి రావాలని కోరారు. ఆయనను దగ్గరనుంచి చూసే అవకాశం కల్సించాలని కోరారు. ఈ పోలీసులే రేపు ఆయన ఇంటి ముందు నిలబడే పరిస్థితి వస్తుంది. జగన్ ను ముఖ్యమంత్రిగా చూసే రోజులు త్వరలోనే ఉన్నాయనా్నరు.  జగన్ కు న్యాయం జరుగుతుందనీ, ఆయన బయటకి వస్తారనీ,  ప్రజలకోసం పనిచేస్తారనీ చెప్పారు.