అధికారాన్ని అడ్డంపెట్టుకొని అచ్చెన్నాయుడు అవినీతి
15 May, 2017 15:45 IST
శ్రీకాకుళం: అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలో విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ విమర్శించారు. మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో వడ్డీ శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రజాధనాన్ని దారి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నాడన్నారు. సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తిలక్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.