వైయస్సార్‌సీపీ కార్యాలయ స్థలం కోసం వినతి
31 Aug, 2016 12:19 IST
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పార్టీ కార్యాలయ నిర్వహణ కోసం నిబంధనలకు అనుగుణంగా 500 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి ఎం, వెంకయ్యనాయుడును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కోరారు. ఈ స్థలాన్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకుంటామని, సాధ్యమైనంత త్వరగా కేటాయించాలని కోరారు. స్థలం కేటాయించి, కార్యాలయం నిర్మించే వరకు తాత్కాలికంగా ఒక భవనాన్నికేటాయించాలని విజయసాయిరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించినట్లు విజయసారెడ్డి తెలిపారు.