మీరు జగనన్న కోసం, జగనన్న మీ కోసం...
30 అక్టోబర్ 2012 : మీరంతా జగనన్న కోసం ఆలోచిస్తుంటే, జగనన్న మీ కోసం ఆలోచిస్తున్నాడని షర్మిల అన్నారు. "మీరున్నారన్నదే మా ధైర్యం. జగనన్నకు మీరే ధైర్యం" అని వ్యాఖ్యానించారు. తన 13 వ రోజు పాదయాత్రలో భాగంగా ఆమె మంగళవారం అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లిలో మహిళలతో కాసేపు మాట్లాడారు. కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై జగనన్నను బెయిలు కూడా రానివ్వకుండా జైలు పాలు చేశారని ఆమె విమర్శించారు. జగనన్న మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడనే కక్షతోనే కుట్రలు చేసి కేసులు వేసి జైలుకు పంపారని షర్మిల ఆరోపించారు. అన్నిటా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి వెంటనే దించేందుకు కావలసిన ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ పని చేయకుండా పాదయాత్ర అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. 90 మంది ఎమ్మెల్యేలుండగా అవిశ్వాసతీర్మానం పెట్టకుండా ఈ యాత్ర లెందుకని ఆమె నిలదీశారు. చంద్రబాబు నీచ రాజకీయాలపై షర్మిల నిప్పులు చెరిగారు.