అంబేద్కర్ విగ్రహం ధ్వసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
5 Apr, 2017 16:43 IST
కదిరి: ఓడి చెరువులో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం వెంటనే అదే స్థానంలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. విగ్రహాన్ని ధ్వసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు తెలియజేస్తామని ఆయన హెచ్చరించారు.