దేశం గర్వించదగ్గ వ్యక్తి మస్తాన్ బాబు: వైఎస్ జగన్

14 Apr, 2015 13:06 IST
నెల్లూరు: పర్వాతారోహణలో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుని కొద్ది రోజుల క్రితం ఆండీస్ పర్వతశ్రేణుల్లో కన్నుమూసిన మల్లి మస్తాన్ బాబు దేశం గర్వించదగ్గ వ్యక్తి అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. మస్తాన్ బాబు పేరుతో స్మారక మందిరం నిర్మించాలన్నారు. మంగళవారం మస్తాన్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మస్తాన్ బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు.