శుద్ధినీటిని సద్వినియోగం చేసుకోవాలి
26 May, 2017 18:14 IST
సింహాద్రిపురం : మండలంలోని బొజ్జాయిపల్లెలో ఎంపీ నిధులు రూ.4లక్షల వ్యయంతో నిర్మించిన శుద్ధినీటి ప్లాంటును శుక్రవారం ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... గ్రామస్తులు శుద్ధి నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామస్తులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అంతకముందు చౌడేశ్వరి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దుంపా వెంకటరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు కొమ్మా పరమేశ్వరరెడ్డి, సురేష్‌రెడ్డి, నాయకులు అరవిందనాథరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.