మహానేత సుస్థిర పాలన అందించారు
30 Nov, 2012 15:19 IST
విశాఖపట్టణం:
ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిరపాలన అందించిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిదేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీదే విజయమని ఆయన జోస్యం చెప్పారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ వ్యవహారం రాజ్యాంగ విరుద్ధంగా సాగుతోందని అంబటి ఆవేదన వ్యక్తంచేశారు.