రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా
25 Aug, 2016 16:18 IST
వైయస్సార్ కడప కార్పొరేషన్ : తెలంగాణ ప్రభుత్వం కరెంటు అవసరాల కోసం శ్రీశైలంలో నీటిని ఇబ్బడిముబ్బడిగా వాడేస్తున్నదని వైయస్సార్‌సీపీ ఆరోపించింది. కడప వైయస్సార్‌సీపీ కార్యాలయంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి, మేయర్ సురేష్‌బాబు విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం నీటి వాడకంపై వచ్చే సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి మహా ధర్నా చేయనున్నట్లు తెలిపారు. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల లెవల్ మెయింటైన్ చేయాలని టీడీపీ సర్కార్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా...దున్నపోతు మీద వాన కురిసిన చందాన వ్యవహరిస్తుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.