పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డిని గెలిపిద్దాం
16 Feb, 2017 18:20 IST
కర్నూలు: రాయలసీమ జిల్లాల్లో వైయస్ఆర్‌సీపీ తరుపున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపిద్దామని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 21వ తేదీన పట్టణంలోని బాబాగార్డెన్‌లో ఓటుహక్కు కల్గిన పట్టభద్రులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి అభ్యర్థి వెన్నెపూస గోపాల్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో పట్టభద్రులతో సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని పట్టభద్రులు సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు.