తండ్రి లాంటి మామను చంపిన చరిత్ర చంద్రబాబుది

4 Aug, 2017 17:32 IST

హైదరాబాద్‌: వైయస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి చంద్రబాబుపై మండిపడ్డారు.  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తండ్రిలాంటి మామను చంపిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ఎన్నో హత్యల్లో చంద్రబాబుకు పరోక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. హత్యా రాజకీయాలపై టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. నంద్యాల ప్రజల ఆవేదననే వైయస్ జగన్‌ చెప్పారని అన్నారు. 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాకు చంద్రబాబు 12 హామీలిచ్చి ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. చంద్రబాబు మోసపూరిత మాటలే జగన్‌ను కదిలించాయని, చంద్రబాబును ఏం చేసినా తప్పులేదని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.