రాజ్యమా ఎందుకు భయం.. అన్న అండగా ఉండగా..
7 Jun, 2018 13:03 IST
పశ్చిమగోదావరి: వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలంతా సంతోషంగా ఉంటారని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లహరిక అనే విద్యార్థిని అన్నారు. వైయస్ జగన్ కోసం ఆమె కవిత కూడా రాసింది. 183వ రోజు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొని కవితను జననేతకు చదివి వినిపించింది.
లహరిక అనే అమ్మాయి వైయస్ జగన్ఫై కవిత రాసింది.
రాజ్యమా నీకెందుకే అంత భయం. మన జగనన్న మనతో ఉండగా..
జీవితాలు చెదిరిపోవు.. బంగారు భవిష్యత్తు కుప్పకూలిపోదు
నేరాలు, ఘోరాలు కొనసాగవు.. అన్యాయం గెలవదు
ఆంధ్రభూమి ఓటమి ఎదుర్కోదు
రాజ్యమా నీకెందుకే అంత భయం మన రాజశేఖరుని పేరు ఇంకా మోగుతుండగా
రైతన్నకు రారాజు.. జనులందరికీ జనక మహారాజు
పండుగ సందడి తెచ్చే ఈ రోజు ఇతనే మా నెలరాజు..
రాజ్యమా నీకెందుకే అంత భయం.. మన అన్న అండగా ఉండగా
జై జగన్ అన్న.. జైజై జగన్ అన్న