కురుపాం గడ్డ.. వైయస్ఆర్ కుటుంబానికి అడ్డా..
20 Nov, 2018 16:42 IST
విజయనగరంః కురుపాం గడ్డ.. వైయస్ఆర్ కుటుంబానికి అడ్డా..అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. కురుపాం నియోజకవర్గంలో ప్రతిఒక్కరి గుండెల్లో దివంగత మహానేత వైయస్ఆర్ దేవుడిలా నిలిచిపోయారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కురుపాం నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. తోటపల్లి ప్రాజెక్టు కట్టింది వైయస్ఆర్ అని, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించింది వైయస్ఆర్ అని, పేదలకు చదువు చెప్పించింది వైయస్ఆర్ అని పేదలకు ఇళ్లు కట్టించింది వైయస్ఆర్ అని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత కురుపాం అనాథలా మారిందన్నారు. కట్టె కాలే వరుకు వైయస్ఆర్సీపీతోనే ఉంటామన్నారు. కురుపాం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, మన ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలలో పరిష్కారిస్తారన్నారు. కురుపాం నియోజకవర్గం ప్రజలు,కార్యకర్తలు, జిల్లా పెద్దలు,ప్రధానంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయని తెలిపారు.