ఎమ్మెల్సీ కోలగట్ల ప్రత్యేక పూజలు
24 Feb, 2017 15:22 IST
విజయనగరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని పసుపతినాథ్ స్వామి ఆలయంలో కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబ సమేతంగా చేరుకొని శివుడికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.