చలించిన వైయస్‌ జగన్‌

20 Dec, 2017 11:48 IST


అనంతపురం: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 8 ఏళ్ల బాలుడిని చూసి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చలించిపోయారు. వైద్యం చేయించుకునేందుకు స్థోమత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితుడు నాగార్జున వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని, చివరకు పెనుకొండ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున బాధను విన్న వైయస్‌ జగన్‌ చలించిపోయారు. నాగార్జునకు అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  అన్ని వైద్య ఖర్చులను వైయస్‌ఆర్‌సీపీ భరిస్తుందని మాట ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, నెలకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తామని వైయస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. జననేత తమ పట్ల చూపిన ప్రేమకు నాగార్జున తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు