కేరళకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేతనం విరాళం
28 Aug, 2018 12:43 IST
అమరావతి: కేరళలో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల వరద బాధితులను ఆదుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.కోటి విరాళం అందజేశారు. తాజాగా కేరళ భాదితులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల వేతనం విరాళం ప్రకటించారు. ఒక నెల వేతనం, అలవెన్సులను కేరళ బాధితులకు అందజేయాలని ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి వైయస్ జగన్ లేఖ రాశారు. ఆగస్టు నెల వేతనాన్ని కేరళ సీఎం సహాయనిధికి జమ చేయాలని లేఖలో పేర్కొన్నారు.