చంద్రబాబు అసహనం

30 Jan, 2016 17:44 IST
బాబు కాపులను కించపరుస్తున్నారు
కాపు కులస్తుల్లో చిచ్చుపెడుతున్నారు
వైఎస్సార్సీపీపై దుష్ర్పచారం మానుకోవాలని..
చంద్రబాబును హెచ్చరించిన ఉమ్మారెడ్డి

హైదరాబాద్ః తూర్పు గోదావరి జిల్లా తునిలో జరగనున్న కాపు ఐక్య గర్జన ను ...చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఇది రాజకీయ సభ కాదని... పార్టీలకతీతంగా నిర్వహిస్తున్న సభ అని చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఉమ్మారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ...భవిష్యత్ తరాల భద్రత, ప్రయోజనాల కోసమే కాపు గర్జన సభ జరుగుతోందన్నారు.  కాపు గర్జన వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయంటూ ...చంద్రబాబు వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఉమ్మారెడ్డి ఫైరయ్యారు. 

కాపుల సంక్షేమం, రిజర్వేషన్లపై  ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెబుతూ దాన్ని చెడగొట్టే ధోరణిలో వైఎస్సార్సీపీ వ్యవహరిస్తున్నాయని చంద్రబాబు అనడం చాలా దురదృష్టకరమైన కామంట్ అన్నారు. కాపుల సంఘ‌టిత శ‌క్తి కించ‌ప‌రిచేలా సీఎం మాట్లాడారని, దీనిని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. గ‌తంలోను అనేక జిల్లాల్లో కాపుల స‌మావేశాలు ఏర‌కంగా జ‌రుగుతున్నాయో... మిగ‌తా కుల‌ల్లో సైతం అలాగే స‌మావేశాలు జ‌రిగాయన్నారు. 1987లో సాక్ష‌త్తు టీడీపీ వరంగ‌ల్‌లో బీసీ సదస్సు నిర్వహించిందని ఉమ్మారెడ్డి చెప్పారు. ప్రతిష్ట దిగజారిపోతుందన్న అసహనంతో చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఉమ్మారెడ్డి విమర్శించారు. 

టీడీపీ ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు చేసిన  రాజ‌కీయాల ప‌నుల‌న్నీ అధికారం కోసం గుంట‌న‌క్క‌లగా చేస్తుంద‌ని ఎప్పుడైనా అప్ప‌టి కాంగ్రెస్ విమ‌ర్శించిందా?  లేదు... ఎందుకంటే అది వారి సంస్కృతి. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు వైఎస్‌. రాజ‌శేఖ‌రరెడ్డి. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అన్న విష‌యం ఈనాటిది కాదు.  1910లో బ్రిటీష్ వారి హ‌యంలోనే కాపు సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్లు ఇచ్చారు. పార్టీలకు అతీతంగా జరుగుతున్న కాపు గర్జనపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ కాపులను రెచ్చగొడుతోందని సీఎం కార్యాలయం చేసిన ప్రకటన దుర్మార్గమన్నారు. ఆ వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగని విధంగా ఉన్నాయన్నారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. కాపుల్లో చిచ్చుపెట్టడానికి టీడీపీ యత్నిస్తోందని దుయ్యబట్టారు.