కడపలో రెహ్మాన్ ప్రార్థనలు
5 Oct, 2012 08:20 IST
కడప : వైయస్ జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరుతూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రెహమాన్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి భారీఎత్తున ర్యాలీగా తరలి వెళ్లిన రెహమాన్ బృందం వైయస్‌ఆర్ జిల్లాలోని అమిన్ పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇడుపులపాయలో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్థనలు నిర్వహించారు.