వైయస్ఆర్ సీపీలోకి చేరికలు
1 May, 2017 16:32 IST
ముమ్మిడివరంః వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణల ఆధ్వర్యంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు కన్నబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని దీమా వ్యక్తం చేశారు.