జనసంద్రంగా మారిన ఇడుపులపాయ
2 Sep, 2012 00:44 IST
ఇడుపులపాయ, 2 సెప్టెంబర్ 2012 : ప్రజా హృదయ నేత వైయస్‌రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు అభిమానజనం పోటెత్తారు. మహానేతను తలచుకుని కన్నీంటి పర్యంతమయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన వైయస్ అభిమానులతో ఇడుపులపాయ పరిసరాలు నిండిపోయాయి. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అభిమానులకు అభివాదం చేశారు. వైయస్‌ఆర్‌ను దేవునిగా భావించి ఇరుముడులు కట్టుకున్న జనం తండోపతండాలు తరలి వస్తున్నారు. వందలాది కిలోమీటర్లు కాలినడకన వచ్చి వైయస్‌ఆర్ ఘాట్ వద్ద ఇరుముడులు సమర్పిస్తున్నారు. అడిగితే కోరికలు తీర్చేవాడు దేవుడైతే అడగకుండానే తమ ఆకలి తీర్చిన వైయస్ అంతకన్నా ఎక్కువని ఇరుముడులు కట్టుకుని వచ్చిన అభిమానులు తెలిపారు.