జై ఆంధ్రప్రదేశ్‌ సభ విజయవంతం

6 Nov, 2016 18:59 IST
విశాఖపట్నంః సాగరతీరంలో ప్రత్యేకహోదా నినాదాలు కెరటాలై ఉప్పొంగాయి. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా విశాఖ సాగర తీరంలో  వైయస్సార్సీపీ నిర్వహించిన  జై ఆంధ్రప్రదేశ్‌ బహిరంగ సభ విజయవంతమైంది. ప్రత్యేక హోదా లక్ష్య సాధన కోసం నిర్వహించిన మొదటి బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. లక్షలాదిగా ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి వైయస్ జగన్ హోదా పోరుబాటకు మద్దతుగా నిలిచారు.  కోట్లమంది టీవీల ముందు ఆసాంతం జగన్‌ ప్రసంగాన్ని వీక్షించి ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో జరుగుతున్న జై ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమాన్ని జయప్రదం చేశారు. గంటా పది నిమిషాల పాటు వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి చేస్తున్న మోసాన్ని తెలియజేశారు.