బండారుకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరామర్శ
కొత్తపేట: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కార్యదర్శి, నియోజకవర్గ కాపు జేఏసీ నాయకుడు బండారు సత్తిరాజు (రాజా)ను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గురువారం పరామర్శించారు. రాజా గుండె సంబంధిత వ్యాధికి గురై హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుని స్వగ్రామం తిరిగి వచ్చారు. ఈ సందర్బంగా ఆయనను జగ్గిరెడ్డి పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరావు, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, మాజీ సర్పంచ్ కామిశెట్టి అమ్మన్న, గ్రామ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మాకే నరసింహమూర్తి, యువజన విబాగం సభ్యుడు ఇసుకపట్ల సునీల్, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కముజు సత్యన్నారాయణమూర్తి తదితరులు ఉన్నారు.