జగన్ వైపే ప్రజల మొగ్గు:వడ్డేపల్లి

27 Nov, 2012 17:50 IST

హైదరాబాద్, 27 నవంబర్ 2012:దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల అమలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింగరావు అన్నారు. రాష్ర్ట ప్రజలు వైయస్ జగన్మోహన్ రెడ్డినే నమ్ముతున్నారని, ఆయనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు.

      వడ్డేపల్లి నర్సింగరావు మంగళవారం ఉదయం చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతోందన్నారు. అందుకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరుతున్నానని వడ్డేపల్లి నర్సింగరావు చెప్పారు.