జగన్ విడుదలకు డిమాండ్
31 Dec, 2012 10:31 IST
హైదరాబాద్:
వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని విడుదల చేసేవరకూ సంతకాల సేకరణ కొనసాగిస్తామని ఆ పార్టీ కార్వాన్ నియోజకవర్గం స్టీరింగ్ కమిటీ సభ్యుడు శివశంకర్, గ్రేటర్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె. అంబాదాస్ పేర్కొన్నారు. జియాగూడ, దరియాబాగ్ ప్రాంతాలలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టి అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో గ్రేటర్ స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటేష్, కె. యాదగిరి గౌడ్, పి. శ్రీనివాస్, జె. చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.