'జగన్మోహన్‌రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలి'
24 Sep, 2012 08:01 IST
చెన్నై, 24 సెప్టెంబర్ 2012: కేవలం తమ మీద వచ్చిన ఆరోపణలకే మంత్రులు వణికిపోతున్నారని, ఏ నేరమూ చేయని తమ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహనరెడ్డిని 118 రోజులు జైలులో ఉంచితే ఎంత క్షోభపడతారో ఆలోచించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు అన్నారు. ప్రభుత్వమే జగన్‌ను బేషరతుగా మేళతాళాలతో ఇంటి వద్ద దింపి రావాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని మంత్రులు చెబుతుంటే అ విషయాన్ని ప్రభుత్వం హైకోర్టుకు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం బేషరతుగా జగన్‌కు క్షమాపణ చెప్పి విడుదల చేయాలని జూపూడి డిమాండ్ చేశారు.