మిర్చి కొనుగోళ్లు పరిశీలిస్తే అడ్డుకుంటారా..?
18 May, 2017 14:33 IST
కృష్ణా జిల్లా: మిర్చి యార్డులో కొనుగోళ్ల పరిశీలనకు వెళ్లిన వైయస్‌ఆర్ సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మిర్చి కొనుగోళ్ల పరిశీలించడానికి వచ్చిన జగన్‌మోహన్‌రావును అక్రమంగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో నందిగామ మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.