'జగన్‌కు పట్టం కట్టేందుకు జనం సిద్ధం'

17 Jan, 2013 20:02 IST
అనంతపురం, 17 జనవరి 2013: మన రాష్ట్రం అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పార్టీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పేర్కొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని ఆయన ఆరోపించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రజల్లో తిరిగితే తమకు ఇక పుట్టగతులు ఉండవన్న భయంతోనే కాంగ్రెస్, ‌తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కుట్ర చేసి ఆ పార్టీలు జైలులో పెట్టించాయని ఆయన దుయ్యబట్టారు.