వికేంద్రీకరణ తక్షణ అవసరం

4 Nov, 2015 07:07 IST

ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార వికేంద్రీకరణ గురించి పవర్ ఫుల్ గా చేసిన పది కామెంట్స్..

1.    13 జిల్లాల్లో ఏకరీతి అభివ్రద్ది అవసరం. అన్నింటిని సమానంగా చూడాలి.

2.    ఒకే ప్రాంతం లో అభివృద్ధిని కేంద్రీకరించి మిగిలిన ప్రాంతాలకు అన్యాయం చేయడం సరికాదు.

3.    ఏ జిల్లాలోనూ ఫలానా ముఖ్యమంత్రి వల్ల తమకు అన్యాయం జరిగింది అని భావించే పరిస్థితి ఉండకూడదు.

4.    ప్రతి నగరంలో అభివృద్ధి జరగాలి.  రాజధాని నగరానికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాల్సిందే.

5.    అసెంబ్లీ, సచివాలయం అక్కడే ఉంచండి. కానీ,  హైకోర్టును కాస్త దిగువకు తీసుకురావాలి. ఇతర గ్రోత్ సెంటర్లు మరో చోటకు తీసుకుపోవాలి.

6.    13 జిల్లాల్లోనూ ముఖ్యమైన పట్టణాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వాటి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ది అవుతాయి. గ్రోత్ సెంటర్స్‌ని వికేంద్రీకరించడం వల్ల అన్ని ప్రాం తాలు అభివృద్ధి చెందుతాయి.

7.    తొమ్మిది రకాల గ్రోత్ సెంటర్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఐటీ గ్రోత్ సెంటర్, మాన్యుఫాక్చరింగ్ గ్రోత్ సెంటర్... ఇలా అన్నిటినీ 100 కి.మీ పరిధిలో ఒకేచోట కేంద్రీకరిస్తున్నారు.

8.    ముఖ్యమంత్రి అనేవాడు మొత్తం 13 జిల్లాలను ఒకేమాదిరిగా చూసేవాడుగా, 13 జిల్లాలకు న్యాయం చేసేవాడుగా ఉండాలికానీ చంద్రబాబు పాలన అలా లేదు.

9.    అన్నిటినీ ఒకే చోట కేంద్రీకరించాలన్న బాబు వైఖరి వల్ల అన్ని ప్రాంతాలలోనూ అశాంతి కనిపిస్తోంది.

10.  అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల ఏరకంగా ఉద్యమాలు పురుడుపోసుకుం టాయో తెలుసుకునేందుకు హైదరాబాద్ ఎపిసోడ్ ఉదాహరణ.