జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ‌ 4కు వాయిదా

26 Dec, 2012 19:05 IST
హైదరాబాద్‌, 26 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి రెగ్యులర్ బెయి‌ల్ పిటిష‌న్పై విచారణను హైకోర్టు 2013 జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.‌‌ శ్రీ జగన్‌పై నమోదు చేసిన కేసులకు సంబంధించి దర్యాప్తు ఎంతవరకూ పూర్తిచేసిందో నివేదిక సమర్పించాలని సిబిఐని హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తిచేస్తామని సుప్రీంకోర్టుకు సిబిఐ చెప్పిందని, ఆ గడువు ఇంకా పూర్తికాలేదని న్యాయస్థానం తెలిపింది. మూడు నెలల గడువు ముగిసిన తరువాత శ్రీ జగన్ బెయిల్ కోసం వస్తే ‌మంచిదని హైకోర్టు అభిప్రాయపడింది. శ్రీ జగన్‌ పెట్టుకున్న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి శేషశయనరెడ్డి బుధవారం విచారణ నిర్వహించారు.

'మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు గత అక్టోబర్‌ 5న మీరు చెప్పారు. అంటే, 2013 జనవరి 4వ తేదీ నాటికి దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంది' అని సిబిఐ తరఫు న్యాయవాదికి హైకోర్టు గుర్తుచేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ దర్యాప్తు విషయంలో ఏమీ మార్పులేదేమని సిబిఐని న్యాయమూర్తి శేషశయనరెడ్డి నిలదీశారు. శ్రీ జగన్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై 2013 జనవరి 4వ తేదీన మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.