జగన్ ఆశయ సాధనకు కృషి

21 Dec, 2012 15:27 IST
గుంటూరు:

వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆశయ సాధనకోసం అందరూ అంకుఠిత దీక్షతో పనిచేయాలని ఆ పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు ఆధ్వర్యంలో నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని జీటీ రోడ్డులో అప్పిరెడ్డి, కావటి మొక్కలు నాటారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ జగన్ జన్మదినాన్ని  పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీని పటిష్టం చేసేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కావటి మాట్లాడుతూ ప్రజల కోసం ఆహర్నిశలు పోరాడుతున్న శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్, టీడీపీ కుట్రపన్ని అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశాయన్నారు. నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పలు ప్రాంతాల్లో చేపట్టామని, జిల్లాలోని అన్ని మండల, పట్టణాల్లో సుమారు రెండు వేల మొక్కలను నాటారని చెప్పారు.