కిడ్నీ బాధితుడిని ఆదుకున్న వైయస్ జగన్
రెండు కిడ్నీలు దెబ్బతిన్న బాలుడిని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్కున చేర్చుకున్నారు. తన వంతు సహాయంగా ఆ బాలుడికి చికిత్స చేయించారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన పురుషోత్తం అనే బాలుడికి రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రుల చుట్టూ తిప్పి రూ. 15 లక్షల వరకు ఖర్చు చేసుకున్నారు. అయినా ఫలితం లేదు. వెంటనే సీఎం చంద్రబాబును కలిసి సాయం చేయాలని కోరారు. అది చేస్తా.. ఇది చేస్తానని చెప్పిన చంద్రబాబు ఏం చేయలేదని బాలుడు పురుషోత్తం మీడియా ముందు వాపోయారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న వైయస్ జగన్‌ను పురుషోత్తం తన తల్లిదండ్రులతో సహా వెళ్లి కలిశాడు. తన బాధను జననేతకు చెప్పుకున్నాడు. పురుషోత్తం కుటుంబ దీనస్థితిని అర్థం చేసుకున్న వైయస్ జగన్ ఆ బాలుడికి డయాలసిస్ చేయించి మెడిసిన్ ఇప్పించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పురుషోత్తంకు ఉచితంగా చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు.