‘బాబు వస్తే కరువు వస్తుందనేది అక్షర సత్యం’

2 Aug, 2017 18:10 IST
- కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.సిద్దారెడ్డి
కదిరి: చంద్రబాబు నాయుడు  అధికారంలోకి వచ్చిన ఆ ఐదేళ్లూ కరువు విలయతాండవించడం సహజమై పోయిందని వైయస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి.సిద్దారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన గాండ్లపెంట మండల కేంద్రానికి సమీపంలో ఉన్న రైతు మస్తాన ప్పకు సంబందించిన పొలంలో ఎండిపోయిన వేరుశనగ పంటను పరిశీలించారు. అక్కడే విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు..కరువు కవలపిల్లలని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ సాగువిస్తీర్ణం 7.5 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి దాకా కేవలం లక్ష హెక్టార్లలో కూడా సాగు చేయలేదన్నారు. సాగు చేసిన వేరుశనగ సైతం వర్షాలు రాక పూర్తిగా ఎండిపోయిందన్నారు. రెయిన్‌గన్‌ల ఒక్క ఎకరం కూడా ఎండకుండా కాపాడామంటూ గత ఏడాదిలో  ముఖ్యమంత్రి చంద్రబాబు .సన్మానాలు  చేయించుకున్నారని, అదో పెద్ద స్కాం అని ఆరోపించారు. తాగడానికి కూడా నీళ్లే లేకపోతో ఒక రెయిన్‌ గన్‌లకు నీళ్లెక్కడి నుండి తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు. గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి దాకా పంటల భీమా ఇవ్వలేదని, వెంటనే ఆ డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని లేదంటే ఆందోళనా కార్యక్రమాలకు దిగాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.  వైఎస్సార్‌సీపీ కదిరి, కదిరి రూరల్, గాండ్లపెంట మండల కన్వీనర్లు బాహవుద్దీన్, ప్రకాష్, చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఆదెప్పనాయుడు, సర్పంచ్‌లు రవీంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజులు రెడ్డి, నాగమల్లు తదితరులు ఉన్నారు.
------------------------
ఆర్ధిక సహాయం :
మూలపల్లి(తలుపుల):ఇటీవల మరణించిన మూలమాలపల్లికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త టి.రమణయ్య  కుటుంబానికి నియోజకవర్గ సమన్వయకర్త డా..పి.వి సిద్దారెడ్డి ,సీఈసీ సభ్యులు పూల.శ్రీనువాసులురెడ్డిలు చెరో 25వేల చొప్పున ఆర్థిక సాయం అందచేశారు.