వైయస్సార్సీపీలోకి వలసల వెల్లువ
29 Apr, 2017 15:12 IST
విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. చంద్రబాబు అవినీతి, అరాచక విధానాలతో విసిగిపోయిన నాయకులంతా ప్రజల పార్టీ వైయస్సార్సీపీ వైపు చూస్తున్నారు. విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గ పరిధిలోని దుమ్రిరిగుడా, ఆర్మ, జోడి మామిడి గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు, ఇతర పార్టీ నేతలు పెద్ద ఎత్తున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ఆర్ సీపీ కన్వినర్ అరుణకుమారి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయి నాయకులు పలువురు పాల్గొన్నారు.