వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ఉక్కునగరం: పలువురు కాంట్రాక్ట్ కార్మికులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టీయూసీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ వైయస్‌ఆర్‌టీయూసీ అనుబంధ కాంట్రాక్ట్ కార్మిక సంఘంలో సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు చేరారు. సెంట్రల్ స్టోర్స్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమంలో స్టీల్ మెల్ట్ షాప్–1లోని సిసిడికు చెందిన ల్యాడిల్ షిఫ్టింగ్ మెయిన్‌టెనెన్స్ కార్మికులు 18 మంది యూనియన్ సభ్యత్వం స్వీకరించారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు బొడ్డ గోవింద్, కార్యదర్శి పిట్టారెడ్డి సమక్షంలో మస్తానప్ప కార్మికులకు కండువాలు కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మస్తానప్ప మాట్లాడుతూ కార్మిక సంక్షేమం కోసం వైయస్‌ఆర్ సీపీ చేస్తున్న పోరాటాలకు స్పందించి కార్మికులు తమ యూనియన్‌లో చేరడం అభినందనీయమన్నారు. ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కాకర వెంకటరావు, సీతారామరాజు, రింగ్ శ్రీనివాస్, పి. నాగిరెడ్డి, సిహెచ్. సుదర్శనం, కె. జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.