ఏపీ అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా
19 Mar, 2016 10:36 IST
హైదరాబాద్ః రోజాను సభలోనికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద నల్లదుస్తులతో నిరసన చేపట్టారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. దీంతో, సభ 10 నిమిషాలు వాయిదా పడింది.