హైకోర్టు తీర్పు హర్షణీయం: గట్టు శ్రీకాంత్ రెడ్డి
3 Aug, 2016 19:26 IST
హైదరాబాద్) ప్రజా విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న జీవో 123 ను హైకోర్టు కొట్టివేసింది. జీవో 123ను కొట్టివేయడం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని తెలంగాణ వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. హైకోర్టు జీవో 123ను కొట్టివేస్తు న్యాయస్థానం వెలువరించిన తీర్పు హర్షణీయమని ఆయన తెలిపారు.