హ్యాపీ ఫాదర్స్ డే
హైదరాబాద్: ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తండ్రి తన కుమారుడిని పెంచే విషయంలో ఎంతటి బలమైన ముద్రను వేస్తారో ఆయన ఒక ట్వీట్ తో పంచుకున్నారు. ఆదివారం ట్విట్టర్లో ఫాదర్స్ డే సందర్భంగా ట్వీట్ చేశారు.
'నా జీవితంలోని ప్రతి ప్రయాణంలో ఎల్లప్పుడు మా నాన్నే నిజమైన గొంతుక. ఆయన నాకు గొప్ప బహుమానం ఇచ్చారు. ఆయన నమ్మకం నాలోనే ఉంది' అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అలాగే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. 'నాన్న మీ చేతి వేలిని పట్టుకొని నడిపిస్తాడు. మీకు ప్రపంచాన్ని చూపిస్తాడు. ఎప్పటికీ మీ వెన్నంటే ఉంటాడు' అంటూ తండ్రి గొప్పతనాన్ని ట్వీట్ ద్వారా పంచుకుంది.
My father was always a voice of certainty in all walks of my life. The greatest gift he gave me, was his belief in me.#HappyFathersDay