వైయస్‌ఆర్‌సీపీలోకి గుంటూరు జిల్లా కాంగ్రెస్ నేతలు.
శ్రీకాకుళంః వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీలకు రాజీనామాలు చేసి వైయస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా వైయస్ జగన్ సమక్షంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల మాజీ అధ్యక్షుడు పద్మారావు,వేమూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి ముత్తయ్య వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసినట్లు నేతలు తెలిపారు.వైయస్ జగన్ వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ టీడీపీకి అమ్ముడుపోయిందన్నారు.టీడీపీ పాలనలో అరాచకం సాగుతుందని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే రాష్ట్రంలో అన్నివర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.జగన్ ముఖ్యమంత్రి కావాలనే దృఢ సంకల్పంతో పార్టీలో చేరినట్లు తెలిపారు.సీనియర్ నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరడం ఆనందంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ నేత మేరుగ నాగార్జున అన్నారు.